వైయస్‌ఆర్‌ సీపీలోకి 100 మంది టీడీపీ కార్యకర్తలు

విశాఖపట్నం: చంద్రబాబు పరిపాలనతో విసిగిపోయి తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలోని గొలుగొండ మండలం నాగాపురం గ్రామానికి చెందిన 100 మంది టీడీపీ కార్యకర్తలు వైయస్‌ఆర్‌ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పేట్ల ఉమాశంకర్‌గణేష్‌ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు నియంతృత్వ పరిపాలనను సొంత పార్టీ నేతలే ఈసడించుకుంటున్నారన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయడమే లక్ష్యంగా పార్టీలో వలసలు ఊపందుకున్నాయన్నారు. 

Back to Top