టీడీపీ నాయ‌కులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌


పశ్చిమగోదావరి : ప్రజల కష్ట సుఖాలను తెలుసుకోవడానికి ప్రజాసంకల్పపాదయాత్రతో బయలుదేరిన వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో టీడీపీకి చెందిన యువకుడు రామసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సుమారు 20 మంది కార్యకర్తలు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలు అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉన్నాయని, రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో వైయ‌స్ఆర్‌ పార్టీలో చేరినట్టు రామ సుబ్రహ్మణ్యం తెలిపారు. పార్టీలో చేరిన వారిలో గౌరిపల్లి, కొవ్వూరు పట్టణాలకు చెందిన పి.సుందర్రావు, మనోజ్, అశోక్, సంజీవ, నాని, ఆర్‌.అప్పారావు, కె.కమల్, వి సుశ్యాం, సీహెచ్‌ ప్రభు, రాహుల్‌ తదితరులు ఉన్నారు. 
Back to Top