టీడీపీ నాయ‌కులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌తూర్పు గోదావ‌రి: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ప‌లువురు ఆక‌ర్శితుల‌వుతున్నారు. నిత్యం ఏదో ఒక ప్రాంతం నుంచి వివిధ పార్టీల‌కు చెందిన నాయ‌కులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరుతున్నారు. ఇవాళ పిఠాపురంలో వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ బాబ్జీ, శ్రీ సంస్థానం మాజీ చైర్మన్‌ రామకృష్ణతో పాటు మరో ఆరుగురు టీడీపీ నాయకులు  వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. వారికి పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ కండువాలు క‌ప్పి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా పార్టీలో చేరిన బాబ్జి మాట్లాడుతూ..2014 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు హామీలు న‌మ్మి మోస‌పోయామ‌న్నారు. ఏ ఒక్క వాగ్ధానం కూడా చంద్ర‌బాబు నెర‌వేర్చ‌లేద‌ని మండిప‌డ్డారు. రాష్ట్రంలో మ‌ళ్లీ రాజ‌న్న రాజ్యం రావాల‌ని, అది ఒక్క వైయ‌స్ జ‌గ‌న్‌తోనే సాధ్య‌మ‌న్నారు. జ‌గ‌న‌న్న‌ను ముఖ్య‌మంత్రిని చేసేందుకు సైనికుళ్లా ప‌ని చేస్తామ‌ని పేర్కొన్నారు.
Back to Top