టీడీపీ నాయ‌కులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

తూర్పు గోదావ‌రి:  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ఇటీవ‌ల అనపర్తి మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి సహా పలువురు నేతలు వైయ‌స్‌ జగన్‌ సమక్షంలో వైయ‌స్ఆర్‌ సీపీలో చేరారు. తాజాగా టీడీపీకి చెందిన ప‌లువురు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. మంగ‌ళ‌వారం టీడీపీ నాయ‌కులు కే. విష్ణుచ‌క్రం, జీ. స‌త్య‌నారాయ‌ణ‌,జి. సుబ్ర‌మ‌ణ్యం, కే.గంగ‌రాజు, కే.సుబ్బారావు, దాస‌రి బంగార‌య్య త‌దిత‌రులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. వారికి వైయ‌స్‌ జగన్‌ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయ‌కులు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో అవినీతి రాజ్యమేలుతుందని విమర్శించారు. మహానేత వైయ‌స్ఆర్‌  తనయుడు వైయ‌స్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే మళ్లీ రాజన్న రాజ్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. వైయ‌స్‌ జగన్‌ను సీఎంను చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.  
Back to Top