శ్రీకాకుళం జిల్లాలో భారీగా చేరికలుశ్రీకాకుళం: టీడీపీ మోసపూరిత పాలనతో విసుకుచెందిన అధికార పార్టీ నేతలు వైయస్‌ఆర్‌సీపీలో చేరుతున్నట్లు వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు మచ్చ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు 500 మంది వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. రణస్థల మండలానికి చెందిన టీడీపీ కార్యకర్తలు వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త గొర్నె కిరణ్‌కుమార్‌ నేతృత్వంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. విజయనగరం పార్లమెంట్‌ సమన్వయకర్త మచ్చ శ్రీనివాసరావు వారిని కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  బాబు మోసపూరిత పాలన ప్రజలకు తెలిసిపోయిందని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎన్నికలు వస్తున్నాయని టీడీపీ నేతలు కొత్త నాటకాలు ఆడుతున్నారని ఫైర్‌ అయ్యారు. గత ఎన్నికల్లో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామన్నారని గుర్తు చేశారు. కేంద్ర మంత్రిగా పనిచేసినా నాలుగేళ్లలో ఒక్క విమానాశ్రయం ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. 
 
Back to Top