టీడీపీ ఎంపీ తోట నర్సింహకు ఎదురుదెబ్బ

సుమారు 500ల మంది కార్యకర్తలతో వైయస్‌ఆర్‌ సీపీలో చేరిన ఎంపీ అనుచరులు
తూర్పుగోదావరి: తెలుగుదేశం పార్టీ ఎంపీ తోట నర్సింహకు జగ్గంపేట నియోజకవర్గంలో ఎదురుదెబ్బ తగిలింది. జగ్గంపేట నియోజకవర్గంలోని ఎంపీ ముఖ్య అనుచరులు బండారు రాజా, ఎంపీటీసీ సత్యనారాయణలు సుమారు 500ల మంది కార్యకర్తలతో కలిసి వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ మేరకు వైయస్‌ఆర్‌ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ జ్యోతుల చంటిబాబు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు బండారు రాజా, సత్యనారాయణలు మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో టీడీపీ విఫలమైందన్నారు. ప్రభుత్వంపై విసుగుచెంది వైయస్‌ఆర్‌ సీపీలో చేరుతున్నట్లు చెప్పారు. అనంతరం జ్యోతుల చంటిబాబు మాట్లాడుతు రాజన్న రాజ్యం వైయస్‌ జగన్‌తోనే సాధ్యమని, వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. 
Back to Top