టీడీపీ నేతలు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

పశ్చిమ గోదావరి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు పలువురు నేతలు ఆకర్శితులవుతున్నారు. బుధవారం లిఖితపూడికి చెందిన టీడీపీ నాయకుడు చిట్టిబాబుతో పాటు 50 కుటుంబాలు వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాయి. వీరికి వైయస్‌ జగన్‌ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. చిట్టిబాబు మాట్లాడుతూ టీడీపీ పాలనలో ఏ ఒక్కరికి మేలు జరగలేదని విమర్శించారు. మా గ్రామంలో తాగేందుకు మంచినీరు లేదని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైందన్నారు. 
 
Back to Top