టీడీపీ నాయ‌కులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌


శ్రీ‌కాకుళం:   జిల్లాలో వ‌ల‌స‌లు మొద‌ల‌య్యాయి. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ఆక‌ర్శితులై అధికార పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ప్ర‌తిప‌క్షంలో చేరుతున్నారు. నరసన్నపెట మండలంలోని టీడీపీ నాయ‌కులు శుక్ర‌వారం వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు ధ‌ర్మాన కృష్ణ‌దాస్ ఆధ్వ‌ర్యంలో  టీడీపీ నాయ‌కుడు, ఎంపీటీసీ స‌భ్యుడు క‌లాం,  మాజీ సర్పంచ్ జల్లు,  పార్వతీశం, రాజిబాబు త‌దిత‌రులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి కృష్ణ‌దాస్ కండువాలు క‌ప్పి పార్టీలో సాద‌రంగా ఆహ్వానించారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ముఖ్య‌మంత్రిని చేసుకుందామ‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.
Back to Top