కుప్పంలో బాబుకు షాక్‌

- వంద మంది వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌
చిత్తూరు:  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై తిరుగుబాటు ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం నుంచే మొద‌లైంది. టీడీపీకి చెందిన వంద మంది ప్ర‌భుత్వ పాల‌న‌పై విసుకుచెంది వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. నియోజ‌క‌వ‌ర్గంలోని వీర్నమల పంచాయతీ వేమనపల్లెకి చెందిన దాదాపు 100 మంది యువకులు తెలుగుదేశం నుంచి చంద్రమౌళి సమక్షంలో వైయ‌స్ఆర్‌సీపీ  చేరారు. ఈ సందర్భంగా వీర్నమల గ్రామంలో పార్టీ జెండాను చంద్రమౌళి ఆవిష్కరించారు. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే వీర్నమల పంచాయతీని 4 చిన్న పంచాయతీలు గా విభజించి అభివృద్ధి జరిగేటట్లు చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.  కార్య‌క్ర‌మంలో పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రీదేవీ , కృష్ణారెడ్డి, చంద్రారెడ్డి, బాబురెడ్డి, రవి నాయక్, చిన్నరాజు నాయక్, మోహన్‌ నాయక్, భాస్కర్‌ నాయక్, కుమార్, గోవిందప్ప, నారాయణస్వామి, బరకత్, రామేగౌడు, మునెమ్మ, ఇంద్రప్ప, మునెప్ప, గంగయ్య, సిద్ధప్ప, మురళి, అప్పి తదితరులు పాల్గొన్నారు. 

Back to Top