టీడీపీ నేతలు వైయస్‌ఆర్‌ సీపీలో చేరిక

ప్రకాశం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంక్షేమం కోసం చేస్తున్న పోరాటాలకు ఆకర్షితులై పలువురు టీడీపీ నేతలు వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. పర్చూరు నియోజకవర్గం హనుమోజీపాలెం వద్ద టీడీపీ నేతలకు వైయస్‌ జగన్‌ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. 25 సంవత్సరాలుగా టీడీపీకి సేవలు చేశామని, కానీ నేడు చంద్రబాబు వైఖరితో విసుగొస్తుందన్నారు. ప్రత్యేక హోదా అంశంపై ముఖ్యమంత్రి పూటకో మాట మాట్లాడుతున్నారన్నారు. వైయస్‌ జగన్‌ ప్రజల కోసం అనేక పోరాటాలు చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా వైయస్‌ జగన్‌ వల్లే సాధ్యమన్నారు.  
Back to Top