టీడీపీ నేత‌లు వైయ‌స్ఆర్‌ సీపీలో చేరిక

 
చిత్తూరు:  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులో అధికార పార్టీ నుంచి వ‌ల‌స‌లు ప్రారంభ‌మ‌య్యాయి. నాలుగేళ్ల చంద్ర‌బాబు పాల‌న‌పై విసుకు చెందిన టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జ‌ల ప‌క్షాన చేస్తున్న పోరాటాల‌కు ఆక‌ర్శితుల‌వుతున్నారు. చిత్తూరు జిల్లా చంద్ర‌గిరినియోజ‌క‌వ‌ర్గం రామచంద్రాపురం మండలం నెత్తకుప్పానికి చెందిన పలువురు టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు  చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో జననేతను కలిసి  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నెత్తకుప్పం సర్పంచ్‌ బి.సుబ్రమణ్యయాదవ్, మాజీసర్పంచ్‌ సీ.సుబ్బరాయులు, వార్డు మెంబర్లు మునిశంకర్‌ నాయుడు, శ్రీనివాసులు, నీలమ్మ, ప్రభాకర్‌ నాయుడుతోపాటు వందమంది కార్యకర్తలకు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
Back to Top