వైయ‌స్ఆర్‌ సీపీలో చేరిక


చిత్తూరు :తంబళ్లపల్లె, కుప్పం నియోజకవర్గాలకు చెందిన పలువురు టీడీపీ నాయకులు వైయ‌స్ఆర్‌ సీపీలో చేరారు. సదుం మండలం మిట్టపల్లెక్రాస్‌ వద్ద పీటీఎం మండలం బూర్లపల్లెకు చెందిన టీడీపీ ఎంపీటీసీ రమణప్ప ఆ పార్టీని వీడి వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. ఆయనకు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే కుప్పం నియోజకవర్గంలోని పెద్ద బంగారునత్తానికి చెందిన 20 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 
Back to Top