టీడీపీ నేతల చిన్నమెదడు చితికింది

  • పచ్చ తమ్ముళ్ల ర్యాలీ, ధర్నాలకే అనుమతులిస్తారా..?
  • అధికారపక్షమే శాంతిభద్రతలకు విఘాతం కల్పించడం దురదృష్టకరం
  • మంత్రి పదవి రాగానే అఖిలప్రియకు కొమ్ములొచ్చాయ్‌
  • అఖిలప్రియకు బార్లంటే ఎందుకంత ప్రేమ
  • తండ్రి చితి కూడా ఆరకముందే మంత్రి పదవి కోసం అసెంబ్లీకి
  • శోభానాగిరెడ్డి ఆశయాలకు తూట్లు పొడుస్తున్న అఖిలప్రియ
  • కేబినెట్‌లో లేడీ పప్పుగా తయారైన టూరిస్టు మంత్రి
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా
నంద్యాల: వైయస్సార్సీపీ నంద్యాల బహిరంగసభకు వచ్చిన ప్రజానికాన్ని చూసి తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల చిన్న మెదడు చితికిపోయినట్లుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. వైయస్‌ జగన్‌ మాటలను వక్రీకరించుకొని టీడీపీ నేతలు మాట్లాడే మాటలు వింటుంటే వారి పార్టీ సంస్కారం ఏంటో అర్థం అవుతుందని ధ్వజమెత్తారు. ప్రత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త దివంగత నారాయణరెడ్డి భార్య శ్రీదేవితో కలిసి ఎమ్మెల్యే రోజా నంద్యాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైయస్‌ జగన్‌ను ఉద్దేశించి ఉన్మాది, సైకో, అంతు చూస్తామని మాట్లాడినప్పుడే టీడీపీ నేతల సంస్కారం ఏంటో ప్రజలకు అర్థమైందన్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లో కింది నుంచి పైస్థాయి వరకు ఆస్కార్ రేంజ్ లో వైయస్‌ జగన్‌ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తూ ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాపులకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కిన చంద్రబాబుకు వ్యతిరేకంగా కాపునేత ముద్రగడ పాదయాత్రకు అనుమతులివ్వరు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు ర్యాలీలు, ధర్నాలకు అనుమతులిస్తారా అని ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలోనైనా ప్రతిపక్షాలు ర్యాలీలు, నిరసనలు చేస్తాయి కానీ ఏపీలో దురదృష్టంకొద్దీ అధికారపక్షమే శాంతిభద్రతలకు విఘాతం కలిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అఖిలకు మహిళా సంక్షేమంపై మాట్లాడే అర్హత లేదు...
తల్లి చనిపోగానే ఎమ్మెల్యే, తండ్రి చనిపోగానే మంత్రి అయిన అఖిల ప్రియకు కొమ్ములు వచ్చాయేమోనని, ఏం మాట్లాడుతుందో.. ఏం చేస్తుందో ఆమెకు అర్థం కావడం లేదని రోజా ఎద్దేవా చేశారు. ఎంతో ప్రశాంతంగా ఉన్న నంద్యాలలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా అఖిలప్రియ వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి ఇంటి ముందుకు కొంత మంది మహిళలను డబ్బులిచ్చి పంపి నానా హంగామా సృష్టించిందన్నారు. 
–మహిళల గురించి మాట్లాడే అర్హత అఖిలప్రియకు లేదని రోజా మండిపడ్డారు. కోడలు మగబిడ్డ కంటానంటే అత్త వద్దంటుందా అని ఆడ పుట్టుకనే అవమానించిన చంద్రబాబు క్యాబినెట్‌లో ఉన్న నువ్వా మహిళల గురించి మాట్లాడేది అని ఫైరయ్యారు. 
– డ్వాక్రా మహిళలను నిట్టనిలువునా ముంచిన పార్టీలో ఉండి, ఎమ్మార్వో  వనజాక్షిని ఇసుకలో వేసి కొట్టిన పార్టీలో ఉన్న నువ్వా మహిళల గురించి మాట్లాడేది. 
– నారాయణ కళాశాలల్లో 25 మందికి పైగా విద్యార్థులు చనిపోతే కనీసం వాటి కారణాలు తెలుసుకోకుండా, మంత్రి నారాయణను భర్తరఫ్‌ చేయని కేబినెట్‌లో ఉన్న నువ్వా మహిళల సంక్షేమం గురించి మాట్లాడేది. 
-టూరిస్టు మంత్రిగా బీచ్‌లలో బీరు పార్లర్లు, బికినీ షోలు పెట్టాలని చేస్తున్న నువ్వా మహిళ శ్రేయస్సు గురించి మాట్లాడేది. అఖిలప్రియ మహిళల గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారన్నారు. బార్లంటే అఖిల ప్రియకు ఎందుకు అంత ప్రేమ అని రోజా ప్రశ్నించారు. 

నీ వ్యక్తిత్వం ఎలాంటిదో ప్రజల గమనిస్తున్నారు...
అఖిలప్రియ సంస్కారం గురించి మాట్లాడుతుంటే మహిళలు ఆమె మొహం మీద ఉమ్మేందుకు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. భూమా నాగిరెడ్డి చితి కూడా ఆరకముందే అఖిలప్రియ చంద్రబాబు ఇచ్చే మంత్రి పదవి కోసం అసెంబ్లీ వరకు వచ్చి వైయస్‌ జగన్‌పై చేసిన విమర్శలు ఎవరూ మర్చిపోలేదన్నారు. సాంప్రదాయం ప్రకారం ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎన్ని రోజులు ఊరు దాటకూడదో కూడా అఖిలప్రియకు తెలియదా అని ప్రశ్నించారు. సాంప్రదాయాలకంటే తన తండ్రిని చంపినవారే ముఖ్యమన్న అఖిలప్రియ ఆలోచనతీరు దారుణమన్నారు.  వారిచ్చే మంత్రి పదవి కోసం భూమా కుటుంబానికి అండగా ఉన్న వైయస్‌ జగన్‌పై విమర్శలు చేశారంటే ఆవిడ వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు అన్నారు. నీ తండ్రి పెద్ద కర్మ చేయడానికి, సంతాప సభ పెట్టడానికి సమయం లేదు కానీ పదవుల కోసం ఆరాటపడుతూ మా నాన్న, అమ్మ చనిపోయారని మాట్లాడుతున్నావంటే నీ వ్యక్తిత్వం ఎలాంటిదో ప్రజలు గమనిస్తున్నారన్నారు. 

పరమానందయ్య శిష్యుల్లా పప్పు శిష్యులు..
విలువలు, విశ్వసనీయత గల శోభానాగిరెడ్డి రక్తం పంచుకొని పుట్టిన అఖిలప్రియ ఆమె రొమ్ముపాలు తాగి ఆవిడ ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తుందని రోజా విమర్శించారు. తల్లిదండ్రుల ఆశయాలకంటే పదవుల ముఖ్యమని మాట్లాడుతూ నీతి మాలిన రాజకీయాలు చేస్తున్నా నువ్వా వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడేది అని అఖిలప్రియపై విరుచుకుపడ్డారు. తండ్రి ఆశయాలే ముఖ్యమని నల్లకాల్వలో ప్రజలకు ఇచ్చిన మాట మేరకు కాంగ్రెస్‌ను వీడి ఓదార్పు యాత్ర చేపట్టిన వ్యక్తి వైయస్‌ జగన్‌ అని, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కుట్రలు చేసి జైల్లో పెట్టించినా వాటన్నింటిని ఎదుర్కొన్న ధీరుడు వైయస్‌ జగన్‌ అని గుర్తు చేశారు.  ఇన్ని రోజులు చంద్రబాబు కేబినెట్‌లో లోకేష్‌ ఒక్కడే పప్పు అనుకుంటే లేడీ పప్పుగా అఖిలప్రియ తయారైందని ఎద్దేవా చేశారు. పరమానంద శిష్యుల్లా పప్పు శిష్యులు తయారయై రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. పప్పు, నిప్పుకు దమ్ముంటే నంద్యాలలో లక్ష మందితో మీటింగ్‌ పెట్టాలని, మూడు సంవత్సరాల కాలంలో హామీలెన్ని నెరవేర్చారో చెప్పాలని సవాలు విసిరారు. వైయస్‌ జగన్‌ లక్షమంది సాక్షిగా ఏవిధంగా శిల్పా చక్రపాణిరెడ్డితో రాజీనామా చేయించారో.. మీరు కూడా 20 మందితో రాజీనామా చేయిస్తే ఎవరి పప్పులు ఉడుకుతాయో తెలుస్తుందన్నారు. 
Back to Top