పచ్చనేతల భూదందాను నిలదీస్తున్నందుకే

వైఎస్సార్సీపీపై పచ్చసర్కార్ కక్షసాధింపు..!
తనిఖీల పేరుతో కార్యకర్తలపై ఖాకీల దౌర్జన్యం..!

గుంటూరు:
రాజధాని ప్రాంతంలో టీడీపీ ప్రభుత్వం అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి.
బలవంతంగా రైతుల భూములు లాక్కోవడం, భూములివ్వని రైతులను బెదిరింపులకు
గురిచేస్తూ పంటలు తగలబెట్టడం,  తిరిగి వారిపైనే కేసులు బుక్ చేసి
చిత్రహింసలకు గురిచేయడం షరా మామూలైపోయింది. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను
నిలదీసిన ప్రతిపక్ష పార్టీ, వైఎస్సార్సీపీపైనా పచ్చనేతలు దాడులకు
తెగబడుతున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని రాజధాని ప్రాంతంలో భయానక
వాతావరణం సృష్టిస్తున్నారు.
 
సోదాల పేరుతో గుంటూరు
జిల్లాలో  వైఎస్ఆర్సీపీ  కార్యకర్తల ఇళ్లపై దాడులు చేస్తూ పోలీసులు
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.  నాదెండ్ల మండలం చందవరంలో పోలీసులు....
కార్యకర్తల ఇళ్లలోకి చొరబడి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.  పచ్చనేతల
భూదోపిడీని నిలదీస్తున్నందుకే వైఎస్సార్సీపీపై కక్షగట్టి దాడులకు
పాల్పడుతున్నారని పార్టీశ్రేణులు మండిపడుతున్నారు.

చంద్రబాబు
ఆదేశాలతో మంత్రులు రాజధాని ప్రాంతంలో తిష్టవేసి హల్చల్ చేస్తున్నారు.
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రోద్భలంతోనే పోలీసులు సోదాలు
నిర్వహిస్తున్నారని, తమపై అకారణంగా కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేసే
కుట్రలు చేస్తున్నారని పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం, పోలీసుల తీరుపై పార్టీ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం
చేస్తున్నారు.
Back to Top