టీడీపీ నేతల దాష్టీకం

విజయవాడ: అభివృద్ధి ముసుగులో ఆలయాలను కూల్చివేస్తున్న టీడీపీ సర్కార్ పై ప్రజలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. టీడీపీ నేతలు గోశాలను తొలగించడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయాల కూల్చివేతలను నిరసిస్తూ విజయవాడలో బంద్ చేపట్టారు. ఐతే, పోలీసులు ముందస్తుగా వైయస్సార్సీపీ నాయకులను హౌజ్ అరెస్ట్ చేశారు. 

మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత గోశాలను భారీ యంత్రాలతో అధికారులు తొలగించారు. దీనిని ప్రశ్నించిన వారిపై  టీడీపీ నేతలు దుర్భషలాడుతున్నారు.  తొలగిస్తాం ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న దురుసుగా ప్రవర్తించారు. 

ఇప్పటి వరకు నగరంలో 44 ఆలయాలను ధ్వంసం చేశారు. తాజాగా కెనాల్‌రోడ్డులోని వరసిద్ధి వినాయక స్వామి ఆలయ తొలగింపునకు  పాలక వర్గంపై ఒత్తిడి తెస్తున్నారు. ఆలయాల తొలగింపుపై నగరవాసులు భగ్గుమంటున్నారు. 
Back to Top