రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలేకనే దాడి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
క‌ర్నూలు:  రాజ‌కీయంగా ఎదుగుద‌ల చూసి ఓర్వ‌లేక‌నే దాడి చేస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కాట‌సాని రామిరెడ్డి అన్నారు. టీడీపీ నేత‌ల అవినీతి, అక్రమాలను ప్రశ్నించిన వారిపై ఇనుప రాడ్లు, కర్రలతో విరుచుకు పడ్డారు. వారి దాడిలో వైయ‌స్ఆర్‌సీపీ వర్గీయులు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బ‌న‌గాన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని వెంక‌టాపురం గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై దాడి ఘటనను పార్టీ బనగానపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి,  నియోజకవర్గ నేత యర్రబోతుల వెంకటరెడ్డి ఖండించారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు పెద్దవెంకటరెడ్డి రాజకీయంగా ఎదుగుండడంతోనే ఓర్వలేక టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారన్నారు. నిందితులను కాపాడేందుకు నాయకులపై ఒత్తిడి తెచ్చి కౌంటర్‌ కేసు నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. బాధితులకు న్యాయం జరగకపోతే పోలీసు స్టేషన్‌ ఎదుట ధర్నా దిగుతామని హెచ్చరించారు. వారి వెంట వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పీఆర్‌ వెంకటేశ్వరరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సిద్దంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, నాయకులు కాటసాని ప్రసాదరెడ్డి, కాటసాని తిరుపాల్‌రెడ్డి, సీనియర్‌ న్యాయవాది అబ్దుల్‌ఖైర్, డాక్టర్‌ మహమ్మద్‌ హుస్సేన్, వెంకటేశ్వరెడ్డిచ కిశోర్‌ తదితరులు ఉన్నారు.Back to Top