వైయస్‌ఆర్‌సీపీ సర్పంచ్‌పై హత్యయత్నం


కర్నూలు: రాయలసీమలో టీడీపీ వర్గీయుల అరాచకాలు కొనసాగుతున్నాయి. గతేడాది వైయస్‌ఆర్‌సీపీ పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణరెడ్డిని దారుణంగా హతమార్చిన పచ్చ పార్టీ నేతలు అదే పంథాను కొనసాగిస్తున్నారు. ఇవాళ వైయస్‌ఆర్‌సీపీ సర్పంచ్‌ హనుమంత్‌పై టీడీపీ నేతలు హత్యాయత్నం చేశారు. పత్తికొండ నుంచి బైక్‌పై వెళ్తుండగా టీడీపీ వర్గీయులు జీపుతో ఢికొట్టారు. టీడీపీ నేతల దాడి నుంచి హనుమంత్‌ తప్పించుకోగా, చికిత్స నిమిత్తం బంధువులు హనుమంత్‌ను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టీడీపీ నేతల తీరుపై వైయస్‌ఆర్‌సీపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
 
Back to Top