వైయస్ జగన్ పర్యటనతో టీడీపీ నేతల్లో గుబులు

అమరావతి

:  వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన రాజధాని ప్రాంత పర్యటనను అడ్డుకునేందుకు అధికార పార్టీ కుయుక్తులు పన్నుతోంది. రెండేళ్లుగా రాజధాని ప్రాంత రైతులకు కనిపించకుండా ముఖం చాటేస్తున్న మంత్రులు, టీడీపీ నాయకులు.. జగన్‌ పర్యటన నేపథ్యంలో హుటాహుటిన అక్కడ వాలిపోయారు. అక్కడకు వచ్చిన మంత్రులను తమ సమస్యలు తీర్చాలని రైతులు పట్టుబట్టారు. సమయం లేదని అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా రైతులు అడ్డుకున్నారు. దీంతో, మంత్రులకు దిమ్మతిరిగింది.  రాజధాని నిర్మాణం పేరుతో పలుహామీలిచ్చి రైతుల భూముల్ని లాక్కున్న ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా గాలికొదిలే సింది. రైతుల వద్ద మిగిలిన ఉన్న భూముల్నీ లాక్కునేందుకు ప్రభుత్వం భూ సేకరణ నోటిíఫికేషన్‌ జారీ చేస్తోంది. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకున్న ప్రతిపక్ష నేత జగన్‌ వారికి అండగా నిలిచేందుకు 19న రాజధాని గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించారు. దీంతో టీడీపీ నేతల్లో గుబులు మొదలైంది.

Back to Top