వెయ్యి మంది వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

 

క‌ర్నూలు :   వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు వివిధ పార్టీల నాయ‌కులు ఆక‌ర్శితుల‌వుతున్నారు. వైయ‌స్ఆర్‌సీపీలోకి వ‌ల‌స‌లు ఊపందుకున్నాయి. క‌ర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండ‌లానికి చెందిన వెయ్యి మంది వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. అంకిరెడ్డిపల్లెకు చెందిన అన్నెం జయరామిరెడ్డి సోదరులతోపాటు సర్పంచ్‌ రాముడు, వెయ్యి మందికి పైగా కార్యకర్తలు, కనకాద్రిపల్లెకు చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు దస్తగిరి.. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కాటసాని రామిరెడ్డి, నియోజకవర్గ నేత ఎర్రబోతుల వెంకటరెడ్డి సమక్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. వారికి శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి కండువాలు వేసి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.  కార్య‌క్ర‌మంలో మండలాధ్యక్షుడు అంబటి గుర్విరెడ్డి, నాయకులు కేపీ రామ్మోహన్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కర్రా హర్షవర్ధన్‌రెడ్డి, అంబటి రామ్మోహన్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Back to Top