టీడీపీకి షాక్..వైయస్సార్సీపీలోకి ఫరూక్ మేనల్లుడు

నంద్యాలః టీడీపీకి నంద్యాలలో గట్టి ఎదురుదెబ్బ తలిగింది.  టీడీపీ ఎమ్మెల్సీ ఫరూక్ మేనల్లుడు, హరున్ మోటార్స్ అధినేత ముస్తాక్ వైయస్సార్సీపీలో చేరారు. వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ సమక్షంలో ముస్తాక్ వైయస్సార్సీపీలో చేరారు.  ఈ సందర్భంగా ముస్తాక్‌కు జననేత కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరో రెండ్రోజుల్లో ఉపఎన్నిక ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున టీడీపీ నేతలు ఆ పార్టీని వీడి వైయస్సార్సీపీలో చేరుతున్నారు. చంద్రబాబు అవినీతి, దౌర్జన్య పాలనతో విసిగిపోయి వైయస్సార్సీపీలోకి క్యూ కడుతున్నారు.


ముస్తాక్‌ మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ సీపీ గెలుపుకు కృషి చేస్తామన్నారు. మరోవైపు రామకృష్ణారెడ్డి డిగ్రీ కాలేజీ అధినేత రామకృష్ణారెడ్డి...వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ప్రకటించారు. కాగా నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈ నెల 23న ఎన్నికలు, 28న ఫలితాలు వెలువడతాయి.


Back to Top