సీబీఐతోనే భూ బాగోతం బయటపడుతుంది

  • భూదందాలకు ఆద్యుడు చంద్రబాబే
  • ఎక్కడైనా దొంగలు విచారణ చేస్తారా..?
  • వైయస్‌ జగన్‌ నాయకత్వంలోభూములు కాపాడుకుంటాం
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్
విశాఖ: టీడీపీ భూ కబ్జాలకు వ్యతిరేకంగా వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదుట చేపట్టిన సేవ్ విశాఖ మహాధర్నా కొనసాగుతోంది. ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ఉక్కునగరంగా పేరు తెచ్చుకున్న విశాఖపట్నం భూదందాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ ఆద్యులని, పంచభూతాలను పంచుకుతిన్తేన్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు. మీకు సంబంధించిన కొందరు అధికారులను తీసుకొచ్చి సిట్‌ అనే కమిటీని వేశామంటే న్యాయమా చంద్రబాబు అని ప్రశ్నించారు. ఆ కమిటీ మీరు సిట్‌ అంటే సిట్‌.. స్టాండ్‌ అంటే స్టాండ్‌ అని, ఆ కమిటీతో న్యాయం జరుగుతుందని నమ్మేవారు ఎవరూ లేరన్నారు. మీరే దొంగలు అని చెబుతుంటే.. దొంగలు విచారణ చేస్తే బాగుంటుందా అని ఎద్దేవా చేశారు. భూములు కాపాడుకునేందుకు సేవ్‌ విశాఖ పేరుతో జిల్లా ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పోరాటం చేస్తున్నామన్నారు. ఈ భూదందాలపై సీబీఐ ఎంక్వైరీ జరిగితే తప్ప న్యాయం జరగదన్నారు. 

వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత కొయ్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్‌ కమిటీ రెండు గ్రామాలకే పరిమితమైందని మండిపడ్డారు. జిల్లా కలెక్టర్‌ మొదట లక్ష ఎకరాలు, రెండోసారి 5 వేల ఎకరాలు అని చెప్పి ఇప్పుడు 267 గ్రామాలకు మాత్రమే విచారణ వేశారన్నారు. టీడీపీ మంత్రులు, వారి మిత్రపక్ష ఎమ్మెల్యే భూములు కబ్జాలకు గురయ్యాయని చెబుతున్నా.. ప్రభుత్వం చలించడం లేదన్నారు. ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ నేతృత్వంలో ప్రభుత్వ భూములు కాపాడుకుంటామని స్పష్టం చేశారు. 

భూకుంభకోణాలపై సీబీఐ ఎంక్వైరీ వేస్తే చంద్రబాబు భూ బాగోతం అంతా బయటపడుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే నారాయణస్వామి డిమాండ్‌ చేశారు. బడుగు, బలహీన వర్గాల భూములను టీడీపీ నేతలు కాజేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో టీడీపీ నేలు కొట్టేసిన లక్షల ఎకరాల విలువ రూ. 2 లక్షల కోట్లకుపైనే ఉంటుందన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా చంద్రబాబు పాటించడం లేదన్నారు. సిట్‌ విచారణలో ఉన్నవారంతా చంద్రబాబు మనుషులేనని, ఎమ్మెల్యే రోజాను ఏ విధంగా సస్పెండ్‌ చేసి తన కమిటీ సభ్యులతో సస్పెన్షన్‌ను పొడిగించారో.. అదే విధొంగా భూ కబ్జాను కూడా మాయ చేయాలనే కార్యక్రమం చేస్తున్నాడని మండిపడ్డారు. ఇటువంటి అవినీతిని ప్రోత్సహించవద్దు అని, ప్రధాని చంద్రబాబు అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్‌ చేశారు. 


తాజా వీడియోలు

Back to Top