రైతు భరోసా యాత్రతో ప్రభుత్వానికి కనువిప్పు

అనంతపురం: జిల్లాలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టనున్న ‘రైతు భరోసా యాత్ర’తో ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందని  పార్టీ అనంతపురం  జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ తెలిపారు.  బ్రాహ్మణపల్లి సర్పంచ్ షాహినాబేగం తమ్ముడు వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బంగారు, రైతుల రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు మాట ఇచ్చి నిలుపుకోలేకపోయారన్నారు. దీంతో బ్యాంకుల నుంచి ఒత్తిళ్లు ఎక్కువ కావడం, నోటీసులు పంపడంతో ఆవేదనతో పలువురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని,  ఆత్మహత్య చేసుకున్న రైతులను పరామర్శించేందుకు ఈ నెల 22న జగన్ మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన చేస్తున్నారన్నారు. రూట్‌మ్యాప్ ఇంకా ఖరారు కాలేదన్నారు. వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
Back to Top