రైతులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం

మందస: దేశానికి వెన్నుముకగా చెబుతూ రైతులకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీవ్రంగా అన్యాయం చేస్తోందని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యదర్శి మెట్ట కుమారస్వామి ధ్వజమెత్తారు. మందసలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ... రాజన్న రాజ్యంలో అన్నదాతకు అన్ని విధాలా సహాయం అందగా, నేడు ఆత్మహత్యలు చేసుకునే దౌర్భాగ్య పరిస్థితుల్లో రైతన్న ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర లభించడంలేదని, పంటలు పండించడానికి పెట్టుబడి కూడా లేని పరిస్థితులు దాపురించాయన్నారు. ధాన్యానికి సరైన ధర లేకపోగా, ఎరువులు ధరలు పెరగడంతో రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారన్నారు. పండించిన పంటలు కొనుగోలు లేక, సరైన ధర రాకపోవడంతో రైతులు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. మిర్చి, టమోటా, పసుపు తదితర పంటలను అగ్నికి ఆహూతి చేస్తున్నారని లేదా పారవేయడం జరుగుతోందన్నారు. దళారీ వ్యవస్థతోనే రైతులకు ఎక్కువగా అన్యాయం జరుగుతుందని, పంటలను నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు.

ప్రభుత్వం పతనం ఖాయం
అవినీతి, కుంభకోణాలు, అక్రమాలు, అన్యాయాలకు టీడీపీ ప్రభుత్వం కేంద్రంగా మారిందని, రాబోయే రోజుల్లో ప్రభుత్వం పతనమవ్వడం ఖాయమని కుమారస్వామి జోస్యం చెప్పారు. వైయస్‌ జగన్మోహనరెడ్డికి అండగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జగన్మోహనరెడ్డి ఏ తప్పు చేయనప్పటికీ, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై తప్పుడు కేసులు బనాయించాయన్నారు. రాబోయే రోజుల్లో కూడా విజయం ఆయన వైపే ఉంటుందని, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు జగన్‌కు అనుకూలంగా తీర్పు ఇస్తారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అని, ఆయన సారధ్యంలో రాజన్న పాలన మళ్లీ వస్తుందన్నారు. రాష్ట్రంలో స్వర్ణయుగం జగన్మోహనరెడ్డి తీసుకు వస్తారన్నారు. శ్రీకాకుళంలో కూడా 10 అసెంబ్లీ స్థానాలకు 10 సీట్లు తప్పక గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. పలాస నియోజకవర్గంలో పార్టీ అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తుందని, వైయస్సార్సీపీ జెండా ఎగురవేసి సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. రైతులకు అండగా జగన్‌ చేస్తున్న దీక్షకు మేధావులు, రైతు సంఘాలు, యువకులు, ప్రజాసంఘాలు మద్ధతివ్వాలని ఆయన కోరారు.
Back to Top