ముస్లింల సంక్షేమాన్ని టీడీపీ తుంగలో తొక్కింది

వైయస్‌ఆర్‌ జిల్లా: ముస్లింల సంక్షేమాన్ని ప్రభుత్వం తుంగలో తొక్కిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ నేత ఖాదర్‌బాషా మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ జిల్లాలోని వైయస్‌ఆర్‌ ఆడిటోరియంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ విభాగం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, అంజద్‌బాషాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మైనార్టీ నేత ఖాదర్‌ బాషా మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ ముస్లింలను ఓటు బ్యాంక్‌గా ఉపయోగించుకుంటుందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ముస్లింలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. త్వరలో వైయస్‌ఆర్‌ సీపీ మైనార్టీల సంక్షేమంపై డిక్లరేషన్‌ ప్రకటిస్తుందని స్పష్టం చేశారు. 

Back to Top