టీడీపీ నిజాలు దాచిపెడుతోంది

గ‌తి త‌ప్పిన పాల‌న‌కు నిర‌స‌న‌గా వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ న‌వంబ‌ర్ 6వ తేదీన విశాఖ‌ప‌ట్నంలో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హిస్తోంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు ధ‌ర్మాన ప్ర‌సాద్ రావు అన్నారు. ఈ స‌భ‌లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ తీరును ఎండ‌గ‌ట్ట‌నున్నార‌న్నారు. శుక్ర‌వారం ఆయ‌న విశాఖ‌ప‌ట్నంలో  మాట్లాడుతూ స‌ర్కార్‌పై నిప్పులు చెరిగారు.  తెలుగుదేశం ప్ర‌భుత్వం నిజాలు దాచిపెడుతోంద‌ని విమ‌ర్శించారు. దేశంకంటే ఏపీదే వృద్ధిరేటు ఎక్కువ‌ని చెప్పుకుంటూ మ‌ళ్లీ నిధుల కోసం కేంద్రాన్ని అడుగుతూ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌న్నారు. స్విస్ చాలెంజ్‌పై స‌ర్కార్ ఎందుకు తోక ముడించిందో స‌మాధానం చెప్పాల‌న్నారు.

Back to Top