టీడీపీ ది కోట్ల రూపాయిల కుంభకోణం

పార్వతీపురం: శ్రీకాకుళం జిల్లా సీతానగరం ప్రాంతంలో తెలుగుదేశం
నాయకులు స్థానికులతో కుమ్మక్కై కోట్ల రూపాయిల కుంభకోణానికి పాల్పడ్డారని
వైయస్సార్సీపీ నాయకులు ఆరోపించారు. స్థానిక ప్రైవేటు బ్యాంకులో జరిగిన కుంభకోణం
మీద నిరసన తెలిపారు. పార్వతీపురం నియోజకవర్గం సమన్వయకర్త జమ్మాన ప్రసన్న కుమార్ తో
పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు
బ్యాంకు ముందు ధర్నా చేసి నిరసన తెలిపారు.
 ప్రభుత్వాధికారులు, బ్యాంకులు
స్పందించని పక్షంలో తాము సీబీఐకి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో
ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు
 కౌన్సిలర్లు గొల్లు వెంకట్రావు, ఓ.
రామారావు,  ఎంపీటీసీలు గండి శంకరరావు,  చింతల జగన్నాధం, బడే రామారావు, సర్పంచ్‌లు
యాండ్రాపు తిరుపతిరావు,  బొమ్మి
రమేష్‌ ,బైరిపూడి కరుణేశ్వరరావు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.  

Back to Top