టీడీపీకి డిపాజిట్లు కూడ రాలేదు

అమరావతిః 175 సీట్లు కావాలని చంద్రబాబు మాట్లాడడం నియంత ధోరణికి నిదర్శనమని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ప్రైవేటు లిమిటెడ్ కంపెనీల వ్యవహారాన్ని నిలదీస్తారన్న భయంతోనే చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలను పెట్టడం లేదని విమర్శించారు. నంద్యాల, కాకినాడలో టీడీపీ ఎలా గెలిచిందో దేశమంతా చూసిందని అన్నారు. ఉపఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం పెద్ద గొప్పేమీ కాదని అన్నారు. 2004 నుంచి 2014వరకు జరిగిన ఉపఎన్నికల్లో 40కి పైగా సీట్లలో టీడీపీ ఓడిపోయిందని గుర్తు చేశారు. మూడొంతుల స్థానాల్లో టీడీపీకి డిపాజిట్లు కూడ రాలేదన్నారు. టీడీపీ కొనుగోలు రాజకీయాలు సాధారణ ఎన్నికల్లో చెల్లవని బుగ్గన అన్నారు.

తాజా ఫోటోలు

Back to Top