ప్రతిపక్షాన్ని విమర్శించే అర్హత టీడీపీకి లేదు

వైయస్‌ఆర్‌ జిల్లా: కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని వ్యక్తులు ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడడం హాస్యాస్పదమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంజద్‌బాషా, కడప పార్లమెంటరీ అధ్యక్షుడు సురేష్‌బాబు అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ సీపీని విమర్శించేందుకు టీడీపీకి సిగ్గుండాలన్నారు. కడప అంటే ఏంటో ఢిల్లీకి చూపించిన నాయకుడు వైయస్‌ అన్నారు. కేసులు పెడతారని తెలిసి కూడా నూతన పార్టీని ఏర్పాటు చేసిన ఏకైక నాయకుడు వైయస్‌ జగన్‌ అని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసిన వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు రాజీనామాలను ఆమోదించుకుని ఎన్నికలకు రావాలని టీడీపీ చెప్పడం సిగ్గుచేటన్నారు. టీడీపీకి, బీజేపీకి మధ్య ఇంకా సత్సంబంధాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. అందులో భాగంగా కర్నాటక ఎన్నికల్లో టీడీపీ బీజేపీకి మద్దతు ఇచ్చిందన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు వైయస్‌ఆర్‌ సీపీపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు
Back to Top