హోదాపై చర్చకు తోకముడిచిన టీడీపీ..సభ రేపటికి వాయిదా

హైదరాబాద్ః ప్రత్యేకహోదాపై చర్చకు టీడీపీ తోకముడిచింది. సభను రేపటికి వాయిదా వెంచుకొని వెళ్లిపోయింది. ప్రత్యేకహోదా అంశంపై ప్రతిపక్ష వైయస్సార్సీపీ సభను స్తంభింపజేసింది. ప్రత్యేకహోదాపై చర్చకు వైయస్సార్సీపీ వాయిదా తీర్మానం ఇవ్వగా స్పీకర్ దాన్ని పక్కనబడేశారు. ఐదుకోట్ల ఆంధ్రుల హక్కు అయిన ప్రత్యేకహోదాపై చర్చ జరగాల్సిందేనని ప్రతిపక్ష సభ్యులు పట్టువదలని విక్రమార్కుల్లా పట్టుబట్టారు. ఏపీకి సంజీవని అయిన హోదాపై చర్చ జరపాలని స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నిరసన తెలిపారు. 

ఐనా కూడా ఎక్కడా అవకాశం ఇవ్వకుండా స్పీకర్ సభను రెండుసార్లు వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ ప్రారంభమయ్యాక బిల్లులను తెరపైకి తీసుకొచ్చారు. చంద్రబాబు ముందస్తు స్కెచ్ ప్రకారం ఆందోళనల మధ్యే జీఎస్టీ సహా  నాలుగు బిల్లులను చదివేసుకొని ఆమోదింపజేసుకొని సభను రేపటికి వాయిదా వేయించుకొన్నారు. ప్రజాసమస్యలను చర్చకు రాకుండా చేసి మూడు రోజుల సమావేశాల్లో ఓ రోజును అధికార టీడీపీ తూతూమంత్రంగా ముగించేసింది. 
Back to Top