విజయనగరం జిల్లాకు ఒరగబెట్టిందేమీ లేదు

 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో , నాలుగేళ్ల కాలంలో
విజయనగరం జిల్లాకు ఒరిగిందేమీ లేదనీ, రాష్ట్రాన్ని పూర్తిగా అథోగతి పాలు చేశారని
వైయస్ ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కేంద్ర
కేబినెట్ లో నాలుగేళ్ల పాటు మంత్రిగా ఉన్న అశోక్ గజపతిరాజు , జిల్లా సమస్యలపై
ఒక్కసారైనా చర్చించారా అని నిలదీస్తూ, ఆయన అలా చేసి ఉంటే తాను తలదించుకుంటానని
అన్నారు. వైయస్ ఆర్ కాంగ్రెస్ పిలుపు మేరకు  విజయనగరం జిల్లాలో జరిగిన వంచన పై గర్జన నిరసన
కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

నాలుగేళ్ల కాలంలో జిల్లాను
ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేస్తూ, కోట సుందరీకరణ,స్టేడియం
అభివృద్ధి తప్ప ఇంకేమీ చేయలేదని అన్నారు. జిల్లాలో ఇసుక మాఫియాను
ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. రైతులు నష్టపోతుంటే కనీసం నష్టపరిహారం
అందించలేదని, జిల్లాలో
రెండు షుగర్ ఫ్యాక్టరీలు ఉంటే ఒకదానిని మూసేశారన్నారు. బొబ్బిలి షుగర్ ఫ్యాక్టరీకి
7
కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని తెలిపారు. 

ప్రతిపక్షంపై అవినీతి
ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలు నాలుగేళ్ల అధికారంలో ఎందుకు
నిరూపించలేకపోయారని నిలదీశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని
ఆయన ఆందోళనవ వ్యక్తం చేశారు. అత్యాచారాల నివారణకు చైతన్యం రావాల్సింది ప్రజల్లో
కాదని, చంద్రబాబు
నాయుడు కేబినేట్లో మార్పు రావాలని ఎద్దేవా చేశారు.

Back to Top