అంతుచూస్తామంటూ టీడీపీ గూండాల హల్చల్

గుంటూరుః
టీడీపీ గూండాల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.  గుంటూరు జిల్లా
తాడేపల్లిలోని పట్టణ కౌన్సిల్ సమావేశంలోకి చొచ్చుకొచ్చి అధికార పార్టీ
నేతలు  బెదిరింపులకు దిగారు. సమావేశ మందిరంలోకి టీడీపీ పట్టణ అధ్యక్షుడు
ఇట్టా పెంచలయ్య, అతని అనుచరులు ప్రవేశించి వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా
నినాదాలు చేశారు. తాము సూచించినవారి పేర్లను జన్మభూమి ఎంపిక కమిటీలో
పెట్టాలంటూ హల్చల్ చేశారు. లేకుంటే అంతచూస్తామంటూ బెదిరించారు. అయితే,
ఇందుకు అంగీకరించే ప్రసక్తే లేదని వైఎస్సార్సీపీ కౌన్సిల్ సభ్యులు
 తేల్చిచెప్పారు. దీంతో టీడీపీ నాయకులు పోడియం ముందు బైఠాయించి నానా రభస
చేశారు. 
Back to Top