మేం లేనప్పుడు స్టేట్‌మెంట్‌ ఇవ్వడం కాదు

  • లీకేజీపై చర్చించేందుకు ప్రభుత్వానికి తీరిక లేదా?
  • నారాయణను కాపాడుతున్న చంద్రబాబు
  • ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌
  • ఏపీ అసెంబ్లీ: సభలో ప్రతిపక్ష సభ్యులు లేని సమయంలో టెన్త్‌ పేపర్‌ లీకేజీపై ముఖ్యమంత్రి చంద్రబాబు దొంగలా వచ్చి స్టేట్‌మెంట్‌ ఇవ్వడం సరికాదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌ ఖండించారు. అరు లక్షల విద్యార్థులకు సంబంధించిన అంశంపై సభలో పది నిమిషాలు చర్చించేందుకు ప్రభుత్వం తీరిక లేదని ఆయన మండిపడ్డారు. గురువారం ఉదయం సభ వాయిదా అనంతరం అనిల్‌కుమార్‌యాదవ్‌ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..టెన్త్‌ లీకేజీపై మేం ఈ నెల 28న సభలో ఆందోళన చేపడితే 30న సీఎం స్టేట్‌మెంట్‌ ఇస్తామని చెప్పారు. మేం సభ నుంచి వాకౌట్‌ చేసిన తరువాత సీఎం నాలుగు లైన్ల స్టేట్‌మెంట్‌ చదవి చేతులు దులుపుకున్నారు. ఈ రోజు చర్చ జరపాలని మేం డిమాండ్‌ చేస్తే..మొన్ననే స్టేట్‌మెంట్‌ ఇస్తామని చెబుతున్నారు. మంత్రులు ఇచ్చే స్టేట్‌మెంట్‌కు, సీఎం ప్రకటనకు పొంతన లేదు. పేపర్‌ లీకేజీ అయిన విద్యా సంస్థ యజమాని, దొంగ మంత్రి నారాయణ.. పరీక్ష తరువాత పేపర్‌ లీక్‌ అయ్యిందని చెబుతున్నారు. ముఖ్యమంత్రికి ఇటీవల మతిమరువు ఎక్కువైంది. ఆయన చెప్పే మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోయింది. సీఎంకు అల్జీమర్స్‌ వ్యాధి వచ్చినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. సీఎం స్టేట్‌మెంట్‌ చూస్తే..పేపర్‌ లీక్‌ 9.35కు జరిగిందని చెప్పారు. మంత్రి 10.45 అంటారు. ఇంకోమంత్రి పరీక్ష అయిపోయిన తరువాత జరిగిందంటున్నారు. సీఎం మాత్రం నారాయణ స్కూల్‌లో లీక్‌ జరగలేదు అంటారు. నారాయణ స్కూల్‌లో అటెండర్‌ లీక్‌ చేసి ఉండవచ్చు అని చెబుతారు.  లీక్‌ అయిన దానిపై చర్యలు లేవు. యాజమాన్యంపై చర్యలు లేవు. వీళ్ల మీద విచారణ లేదు. కానీ లీక్‌ జరుగుతుందని ఈ అంశాన్ని డీఈవో దృష్టికి తీసుకెళ్లిన సాక్షి విలేకరిపై మాత్రం చర్యలకు ఈ ప్రభుత్వం ముందుకు రావడం దారుణం. ఈ ప్రభుత్వ తీరు ఎలా ఉందంటే..తప్పులు వారు చేయడం, ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం, దీని వెనకాలా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఉన్నారు..సాక్షి ఉందని ఆరోపణలు చేయడం అధికార పార్టీకి అలవాటైంది. అధికారులను కొడతారు, దూషిస్తారు. కేసులు పెడుతారు. నారాయణ విద్యా సంస్థలు ఏవిధంగా పేపర్‌ లీక్‌ చేస్తున్నాయి, ఎవరెవరికీ వాట్సప్‌ ద్వారా పేపర్‌ వెళ్లింది అన్న దానిపై విచారణ చేపట్టడం లేదు. సీబీఐ విచారణ వేస్తే కచ్చితంగా నిజాలు వెలుగులోకి వస్తాయి. ఒక విద్యార్థి తప్పు చేస్తే మూడేళ్లు డీబార్‌ చేస్తారు. అలాగే ఒక యాజమాన్యం తప్పు చేస్తే ఎందుకు ఆ కాలేజీని బ్యాన్‌ చేయడం లేదని ప్రశ్నిస్తున్నాం. నారాయణ స్కూళ్ల వెనుకాలా చంద్రబాబు ఉన్నారు. ఈ నారాయణ ఎవరో కాదు ముఖ్యమంత్రి బినామీ అని నెల్లూరు జిల్లాలో ఎవరైనా చెబుతారు. సీఎం బినామీ కావడంతో నారాయణను నేరుగా మంత్రిని చేశారు. రాజధాని నిర్మాణ పనులు ఆయనకు అప్పగించారు. నారాయణను అరెస్టు చేస్తే ఎక్కడ తిరుగబడుతారో అన్న భయం చంద్రబాబుకు ఉంది. అందుకే నారాయణపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. తప్పకుండా సీబీఐ విచారణ చేపట్టాలి. డిక్షనరీలో లేని కొత్త కొత్త పదాలు సీఎం తీసుకొని వస్తున్నారు. ప్రతిపక్షం లేని సమయంలో దొంగలాగా వచ్చి స్టేట్‌మెంట్‌ ఇవ్వడం కాదు. ఈ రోజు చర్చకు రండి. దోషులు ఎవరైనా సరే కచ్చితంగా శిక్షించాల్సిందే. నిన్న కూడా పేపర్‌ లీక్‌ అయ్యింది. ఈ రోజు చివరి పరీక్ష. ఇక ర్యాంకులన్నీ నారాయణ విద్యాసంస్థలకే వస్తాయి. దీనికి మొత్తం కుట్రదారులు కచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబే. మేం వాకౌట్‌ చేసిన సమయంలో దొంగలాగా స్టేట్‌మెంట్‌ ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలి. ప్రతిదానికి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డే కారణం అని తప్పుకోవడం సరికాదు. సభ ఆర్డర్‌లో లేనప్పుడు అధికార పార్టీకి మైక్‌ ఇచ్చి తిట్టించవచ్చా? ఆర్డర్‌లో లేనప్పుడు బిల్లులు ఆమోదం పొందవచ్చా? అప్పుడు సభా సంప్రదాయాలు గుర్తుకు రావా? ఘన చరిత్ర ఉన్న మంత్రి యనమల, నలభై ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబుకు సభా సాంప్రదాయాలు తెలియవా? ఏరు దాటాక తెప్ప తగలేసే తత్వం చంద్రబాబుకే ఉంది. ఆరు లక్షల విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశంపై పది నిమిషాలు చర్చించే సమయం వారికి లేదా? ఐదు నిమిషాలు సమయం ఇవ్వలేదా? ఇప్పుడు గంట పాటు సభను వాయిదా వేశారు. ఈ సమయంలో చర్చించవచ్చు కదా? మూడేళ్ల నుంచి మంత్రులు అరిగిపోయిన టేప్‌ రికార్డులాగా వైయస్‌ జగన్‌ జపం చేస్తున్నారు.
Back to Top