ఎన్నికల హామీలను గాలికి వదిలిన టీడీపీ

అనంతపురం: తెలుగు దేశం పార్టీ నేతలు ఎన్నికల హామీలను గాలికి వదిలేశారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి మండిపడ్డారు. ప్రజలను మోసం చేయడమే టీడీపీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన విమర్శించారు. సోమవారం స్థానిక ఆర్‌డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకుల దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రజలను మోసం చేయడంలో టీడీపీ నేతలు నిష్ణాతులని గుర్నాథరెడ్డి అన్నారు.

Back to Top