హామీల అమ‌లులో ప్ర‌భుత్వం విఫ‌లం బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

విశాఖ‌: ఎన్నిక‌ల హామీలు అమ‌లు చేయ‌డంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ మండిప‌డ్డారు. దోచుకోవడమే రాష్ట్ర పాలనగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు. వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ స్థాయి ప్లీనరీ కొత్తకోట గ్రామంలో గురువారం నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజ‌రైన బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ..రుణ‌మాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మ‌హిళ‌ల‌ను మోసం చేశార‌ని, ఇంటికో ఉద్యోగం ఇస్తామ‌ని నిరుద్యోగుల‌ను ద‌గా చేశార‌ని విమ‌ర్శించారు. వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితేనే మ‌న స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. కార్యక్రమంలో చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట మండలాల వైయ‌స్‌ఆర్‌సీపి అధ్య‌క్షులు అప్పికొండ లింగబాబు, అచ్చెంనాయుడు, పతివాడ చిన్నంనాయుడు, పోతల శ్రీను, స్థానిక నాయకులు డిసిఎంఎస్‌ చైర్మన్‌ ముక్కా మహలక్ష్మినాయుడు, డిసిసిబి డైరెక్టర్‌ గుమ్ముడు సత్యదేవ, మండల పార్టీ ఉపాధ్య‌క్షుడు శీలం శంకర్రావు, జిల్లా కార్యదర్శులు కంచిపాటి జగన్నాదరావు, తలారి ఆదిమూర్తి, సీనియర్‌ నాయకుడు పందల దేవా, గారపాటి సత్తిబాబు, కొత్తకోట ఉప సర్పంచ్‌ కేదారిశెట్టి గున్నాజీరావు, పార్టీ యూత్ అధ్య‌క్షుడు రావి గోవిందరావు, ఉపాధ్య‌క్షుడు గుమ్ముడు దొర, కార్యదర్శి మానేపల్లి శ్రీనివాస, దొండపూడి సర్పంచ్‌ గట్రెడ్డి తాతబాబు, చీమలపాడు సర్పంచ్‌ వంజరి గంగరాజు,టి.అర్జాపురం ఉప సర్పంచ్‌ ఇల్లపు సన్యాశినాయుడు, మాజీ సర్పంచ్‌లు దంట్ల వెంకట రమణ, గాలి రమణబాబు, గవిరెడ్డి కొండనాయుడు,   తదితర్లు పాల్గొన్నారు.

Back to Top