బాబు వస్తే జాబు అని నిలువునా ముంచాడు

రానున్న ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీకి 170 సీట్లు గ్యారంటీ
తూర్పుగోదావరి జిల్లా కాపు నేతలు
తూర్పుగోదావరి: బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత తన కుమారుడు లోకేష్‌ మాత్రమే జాబు కల్పించారని తూర్పుగోదావరి జిల్లా వాసులు ధ్వజమెత్తారు. చంద్రబాబు నిరుద్యోగులను మోసం చేశాడని పలువురు నాయకులు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి చెప్పారు. చంద్రబాబు వైఖరితో యువత తీవ్రంగా నష్టపోయిందన్నారు. రాష్ట్రంలో విచ్చల విడిగా దోపిడీ జరుగుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని వైయస్‌ జగన్‌కు వివరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తగిన గుణపాఠం చెప్పేందుకు నిరుద్యోగులు, మహిళలు, యువత, రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు. రానున్న ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ అత్యధిక మెజార్టీతో గెలుపొందుతారన్నారు. 170 సీట్లు కైవసం చేసుకునే పరిస్థితి కనిపిస్తుందన్నారు. కాపులను బీసీల్లో నమ్ముతారని మోసం చేశారని, వైయస్‌ఆర్‌ సీపీకి కాపుల మద్దతు ఉందని, అత్యధిక మెజార్టీతో గెలిపించి జననేతను సీఎంను చేసుకుంటామన్నారు. వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలు అందరినీ ఆకర్షిస్తున్నాయన్నారు. 
Back to Top