మహిళల్ని ఈరకంగా మోసపుచ్చుతారా..!

ఇసుక లూటీకి పన్నాగం..!
రీచ్ లనుంచి డ్రాక్వా మహిళలను తప్పించే కుట్ర..!

ఇసుక దందాపై ప్రభుత్వం సరికొత్త పథకానికి తెరలేపుతోంది.  ఇప్పటికే ఇసుకబకాసురులు అవతారమెత్తిన పచ్చనేతలు,,మరింతగా దోచుకునేందుకు సైడ్ ట్రాక్ పట్టారు. ఇసుక రీచ్ లు నిర్వహించడంలో డ్వాక్రా మహిళలు విఫలమయ్యారని ఓ నెపం వేసి...తద్వారా తమ అవినీతి వ్యవహారం కొనసాగించేందుకు  పావులు కదుపుతున్నారు. పాత కాంట్రాక్టర్లకు రీచ్ లు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. 

ఇసుక అమ్మకాలు, అక్రమాల పేరుతో దోచుకునే దానిపై కేబినెట్లో బాగానే చర్చించారు. దందా చేసుకునేందుకు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని కొందరు మంత్రులు చిన్నబుచ్చుకున్నారట. దీంతో,ఇసుక రీచ్ లను మహిళలనుంచి మెల్లగా లాక్కొని ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు చంద్రబాబు పచ్చజెండా ఊపారు. 

ఐతే, ఇప్పటికిప్పుడు తప్పిస్తే డ్వాక్రామహిళలు తిరగబడతారని,  అక్రమాల నియంత్రణ పేరుతో సివిల్ అధికారులను నియమించాలని ప్లాన్ వేశారు. తద్వారా వారితో నివేదిక ఇప్పించుకొని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు వ్యూహరచన చేస్తున్నారు. నిబంధనలను కాలరాస్తూ విచ్చలవిడిగా ఇసుకను సరిహద్దులు తరలిస్తూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న తెలుగుతమ్ముళ్లు...రాష్ట్రాన్ని లూటీ చేసే పనిలో ఉన్నారు. రాష్ట్రాన్ని నిలువునా దోచుకుంటున్నపచ్చనేతలను తరిమికొట్టాలని పలువురు ప్రజలకు పిలుపునిస్తున్నారు.
Back to Top