ప్రజా కంఠక పాలననుసాగనంపాలని ఉవ్విళ్లూరుతున్నారు...

గూడూరు:వైయస్‌ అందించిన జనరంజక పాలనకూ.. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వ ప్రజా కంఠక పాలననూ ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని, ఎప్పుడు రెండేళ్ల కాలం గుడుస్తుందా.. సాగనంపుదామా అని ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్‌ అన్నారు. స్దానిక రభ శాఖ అతిధి గృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గూడూరులో ఈ నెల 8వతేదీన నియోజకవర్గ ప్లీనరీ సమావేశాం దిగ్విజయం చేశామని, అలాగే జూలై 2వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు నెల్లూరులోని అనిల్‌ గార్డెన్స్‌లో జరుగనున్న జిల్లా ప్లీనరీని కూడా విజయవంతం చేసే దిశగా నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీఈసీ సభ్యులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రాజన్న రాజ్యంలో రైతు సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉన్నాడని, ఈ టీడీపీ పాలనలో సర్వనాశనం అయిపోయి పదిహేనేళ్లు వెనక్కు వెళ్లిపోయాడన్నారు. గతంలో ’ 5 లక్షలు అమ్మిన ఎకరా సవక ఇప్పుడు ’ 30 వేలకు కూడా అడగం లేదన్నారు. అలాగే జామాయిల్‌ టన్ను ’ 5,200 ఉండేదని, ఇప్పుడు కనీసం ’ 2 వేలకు కూడా అగిగేవారు కరువయ్యారన్నారు. అలాగే మామిడి కాయలు కూడా కిలో ’ 80 పలికేవని, ప్రస్తుతం అవి కూడా ’ 20కి కూడా అడగడం లేదన్నారు. ఇలా రైతు నిలువునా కృంగిపోయారన్నారు. బాబు పాలనలో చినుకు పడదని రైతులకు అర్దమైపోయిందని, రెండేళ్లుప్పుడు పూర్తవుతుందా ఈ పాలనకు చరమగీతం పాడుదామా అని ఎదురు చూస్తున్నారన్నారు. నియోజవర్గస్దాయి నుంచి జిల్లా స్దాయి, రాష్ట్ర స్దాయిల్లో ప్లీనరీలు నిర్వహించి నిర్ణయాలు తీసుకోవడం ఎంతో గొప్ప పరిణామమని, ఈ నెల 8, 9 తేదీల్లో గుంటూరులో జరిగే రాష్ట్ర స్దాయి ప్లీనరీలను కూడా జయప్రదం చేసే దిశగా నియోజవర్గ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యోన్ముఖులు కావాలన్నారు. ఈ సమావేశంలో గూడూరు రూరల్‌ మండల పార్టీ అద్యక్షులు మల్లు విజయకుమార్‌రెడ్డి, పట్ట అద్యక్షులు బొమిడి శ్రీనివాసులు, కౌన్సిలర్‌లు నాశిన నాగులు, గిరిబాబు, మాజీ కౌన్సిలర్‌ తాళ్లూరు శ్రీనివాసులు, నాయకులు గూడూరు రాజేశ్వరరెడ్డి, పెంచలరెడ్డి, రూపేష్‌రెడ్డి, రంగారెడ్డి, మగ్దూం, వెంకటేశ్వర్లు, బిక్కుసాహేబ్, మురళి, నర్సయ్య, మల్లిగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top