కులాల చిచ్చు రేపుతున్న టీడీపీ ప్రభుత్వం

పెనమలూరుః టీడీపీకి ఓట్లు వేసిన పుణ్యానికి కులాల మధ్య చిచ్చు రేపుతున్నారని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొఠారిశ్రీనివాసరావు ఆరోపించారు. ఆయన శుక్రవారం కానూరులో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబునాయుడికి ఇతర కులాల పై ఉన్న తేలిక భావం కారణంగానే నేడు రాష్ట్రంలో అట్టడుగు వర్గాలను హేళన చేస్తున్నారని విమర్శించారు. మంత్రి ఆదినారాయణరెడ్డి ఎస్సీ వర్గాలను కించపరిచి మాట్లాడినా ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. టీడీపీ పాలనలో న్యాంయ కోసం పోరాటం చేస్తున్న కాపల నాయకులను పోలీసులు నిత్యం వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబునాయుడికి ప్రతీ ఒక్కరు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

Back to Top