ప్ర‌జా సంక్షేమాన్ని విస్మ‌రించిన సర్కార్ :వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలుఉర‌వ‌కొండ‌:  ప్ర‌జా సంక్షేమాన్ని టీడీపీ ప్ర‌భుత్వం పూర్తిగా విస్మ‌రించి అస‌మ‌ర్థ పాల‌న కొన‌సాగిస్తోంద‌ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వ‌ర్‌రెడ్డి, చాంద్‌బాషాలు అన్నారు. బాధ్య‌త గ‌ల ప్ర‌తిప‌క్ష పార్టీ వైఎస్సార్ సీపీ ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే ల‌క్ష్యంగా ప‌ని చేస్తోంద‌ని   వివ‌రించారు. అర్హులైన నిరుపేద‌ల‌కు ఇంటిప‌ట్టాలు మంజూరు చేసి ప‌క్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండ‌లోని త‌హ‌శీల్దార్ కార్యాల‌యం ఎదుట వైఎస్సార్‌సీపీ జ‌డ్పీటీసీలు, ఎంపీటీసీలు, వార్డు స‌భ్యుల ఆధ్వ‌ర్యంలో 25 గంట‌ల పాటు దీక్ష చేప‌ట్టారు. అనంత‌రం వారు మాట్లాడుతూ.... దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌రరెడ్డి  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను గుడిసె లేని రాష్ట్రంగా నిర్మించాల‌న్న ల‌క్ష్యంతో ఇందిర‌మ్మ ఇంటి ప‌థ‌కం పేర 25 ల‌క్ష‌ల ఇళ్లు పేద‌ల‌కు క‌ట్టించార‌ని గుర్తు చేశారు. అంతేకాకుండా ప్ర‌తి పేద‌వాడికి నాణ్య‌మైన ఆరోగ్యం కోసం ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం అమ‌లులోకి తీసుకొచ్చిన మ‌హానేత వైఎస్సార్ అని ఎమ్మెల్యేలు అన్నారు. మ‌రి అధికారంలోకి వ‌చ్చి రెండేళ్ల‌వుతున్నప్పటికీ చంద్ర‌బాబు ఇంత‌వ‌ర‌కు ఒక్క పేద‌వాడికి సెంటుభూమిని కేటాయించిన పాపాన పోలేద‌ని విమ‌ర్శించారు. 

తాజా ఫోటోలు

Back to Top