చేతలు శూన్యం..మాటలతో కోటలు

హైదరాబాద్: కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు
సర్కార్ పై నిప్పులు చెరిగారు. టీడీపీ ప్రభుత్వం మాటలకే పరిమితమైందని,
చేతలు శూన్యమని విమర్శించారు. టీడీపీ పాలనలో రాయలసీమకు పూర్తిగా అన్యాయం
జరుగుతోందని అన్నారు. పారిశ్రామిక రాయితీలు కేవలం అమరావతి ప్రాంతానికే
కావాలని  సీఎం కోరడం దుర్మార్గమని నేతలు మండిపడ్డారు. టీడీపీ ప్రజావ్యతిరేక
పాలనను ఎండగడతామన్నారు. 

ఏపీ ప్రతిపక్ష నేత,
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హైదరాబాద్ లోటస్ పాండ్ లో కర్నూలు
జిల్లా పార్టీనేతలతో సమావేశమయ్యారు. ప్రజాసమస్యలు, పార్టీ బలోపేతానికి
సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. వైఎస్ఆర్సీపీని
 గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని పార్టీ నేతలకు సూచించారు.  అదేవిధంగా
ప్రభుత్వ వైఫల్యాలపై  నేతలు వైఎస్ జగన్ తో చర్చించారు. ఎంపీ బుట్టా రేణుక,
ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, మణిగాంధీ
తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
Back to Top