టీడీపీ సర్కార్ హోదాను హ‌త్య చేస్తోంది

- హోదా తీసుకురావడం చేత‌కాక‌పోతే బాబు త‌ప్పుకోవాలి
- ప్ర‌త్యేక హోదాను ప్ర‌జ‌లే తెచ్చుకుంటారు
-  సుజ‌నాచౌద‌రి హోదా గురించి చేసిన వ్యాఖ్య‌లు దారుణం
-వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి వాసిరెడ్డి ప‌ద్మ‌

హైద‌రాబాద్‌: కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌త్యేక హోదా అనే ప‌సికందు గొంతునులిమి పిండ‌ద‌శ‌లోనే భ్రూణ హ‌త్య చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి వాసిరెడ్డి ప‌ద్మ నిప్పులు చెరిగారు.   వైయ‌స్సార్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఆమె విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడాపు. ప్ర‌త్యేక హోదా తీసుకురావ‌డం చేత‌కాక‌పోతే చంద్ర‌బాబు త‌ప్పుకోవాల‌న్నారు.  ఏపీ ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేక హోదా ఎలా తెచ్చుకోవాలో తెలుస‌నని ఆమె పేర్కొన్నారు.

మ‌రిన్ని విష‌యాలు ఆమె మాటల్లోనే..
() ప్ర‌త్యేక హోదా వ‌ల్ల ఎంత లాభం క‌లుగుతుందో అంత‌మేర కేంద్రం డ‌బ్బులిస్తుంద‌ని సుజ‌నాచౌద‌రి అన‌డం సిగ్గుచేటు
() ప్ర‌త్యేక హోదాకు బ‌దులు ప్ర‌త్యేక ప్యాకేజీ ఇస్తే అది కేవ‌లం టీడీపీ ప్ర‌భుత్వానికే మేలు. ప్ర‌త్యేక ప్యాకేజీ వ‌ల్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు ఎటువంటి లాభం లేదు. ప్ర‌త్యేక హోదాతోనే ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ప్ర‌తి కుటుంబం ల‌బ్ధిపొందుతుంది
() ప్ర‌త్యేక హోదా వ‌ల్ల ప్ర‌తి కుటుంబంలో ఒక‌రికి చిన్న నుంచి పెద్ద‌స్థాయిలో ఉద్యోగం ల‌భిస్తుంది
()మొద‌టి నుంచి టీడీపీ స‌ర్కార్ ప్ర‌త్యేక హోదాకు వ్య‌తిరేక‌మే. వ్య‌తిరేకంగా ప‌ని చేయ‌డం వ‌ల్లే  రాష్ట్రంలో రెండున్న‌రేళ్లుగా ఇటువంటి ప‌రిస్థితి దాపురించింది
() వ‌న‌రులు ఉన్న రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా వ‌స్తే దేశంలోనే నంబ‌ర్ 1గా ఏపీ మారుతుంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా త‌ప్ప‌నిస‌రి అని ఆనాటి ప్ర‌ధాని పార్ల‌మెంట్ సాక్షిగా పేర్కొన్నారు. ఏపీ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను, బాధ‌ల‌ను  చంద్రబాబు గాలికొదిలేస్తున్నారు
()14వ ఆర్థిక సంఘం, నీతిఆయోగ్‌, జీఎస్‌టీ వంటి వాటిని అడ్డం పెట్టుకొని టీడీపీ కాలం వెల్ల‌దీస్తుంది. టీడీపీ - బీజేపీలు జ‌త‌క‌ట్టిన ఎనిమిది నెల‌ల వ‌ర‌కు 13వ ఆర్థిక సంఘమే ఉంది
()టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన మొద‌టి ఏడాదిలోపు ప్ర‌త్యేక హోదా వ‌చ్చుంటే.... ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృధ్ధి ఎంతో పెరిగేది
()జాబ్ కావాలంటే బాబు రావాలి అన్న నినాదంతో అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు... ఇప్పుడు జాబ్ ఉండాలంటే బాబు పోవాలి అనే స్థాయికి దిగ‌జారిపోయారు
()ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైద‌రాబాద్‌ను కోల్పోయింది. ప్ర‌త్యేక హోదా వ‌స్తే ఏపీకి పరిశ్ర‌మ‌లతో పాటు ఎన్నో లాభాలు ఉన్నాయి
() పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో కేంద్ర‌మే నిర్మించి ఇవ్వాల్సి ఉంది. సుజ‌నాచౌద‌రి మాత్రం నాబార్డు నుంచి నిధులు కేటాయిస్తామ‌న‌డం హాస్య‌ాస్ప‌దం. ఇప్ప‌టికే ఏపీ అప్పుల కుప్ప‌గా మారింది... తిరిగి పోల‌వ‌రం ప్రాజెక్టు కోసం అప్పులా?
()రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను టీడీపీ స‌ర్కార్‌ కేంద్రానికి తాకట్టు పెడుతోంది . ప్ర‌త్యేక హోదా విష‌యంలో టీడీపీ సూటిగా, సుత్తి లేకుండా స్ప‌ష్ట‌మైన వైఖ‌రి తెల‌పాలి. ఇప్ప‌టికైనా కేంద్రానికి డెడ్‌లైన్ పెట్టాలి
() ప్ర‌త్యేక హోదా ఆంధ్ర‌ప్ర‌దేశ్ హ‌క్కు. బాబు - మోడీల జోడి చూసి ప్రత్యేక హోదా తీసుకొస్తార‌న్న న‌మ్మ‌కంతో ప్ర‌జ‌లు ఓట్లు వేశారు. కానీ ఇప్ప‌టికీ ప్ర‌త్యేక హోదా రాక‌పోవ‌డం దారుణం
()టీడీపీకి చేత‌కాక‌పోతే ప‌క్క‌కు త‌ప్పుకోవాలి త‌ప్ప... సైంధ‌వుల్లాగా అడ్డుప‌డ‌కుడ‌దు. 
()రాజకీయ నాయ‌కుల‌కు కోర్టుల‌కు మించిన కోర్టు... ప్ర‌జాకోర్టు... అటువంటి ప్రజాకోర్టులో చంద్ర‌బాబు ఒక దొంగ‌లా నిల‌బ‌డ్డారు. బ్రీఫ్‌ఢ్‌మీ అంటూ అడ్డంగా దొరికిపోయారు. బాబు ఎలాంటి నిప్పో, తుప్పో  ప్ర‌జ‌ల‌కు అంతా అర్థ‌మైంది

Back to Top