తూతూ మంత్రంగా కొనుగోలు

గుంటూరు : నరసరావుపేట మార్కెట్‌ యార్డులో ప్రభుత్వం తూతూ మంత్రంగా వారం రోజులపాటు మాత్రమే మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు కేంద్రం నడిపి గత నెల 30వ తేదీతో ముగించిందని ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. తన విలాసాలు, విహారయాత్రలకు వందల కోట్లు ఖర్చు చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పంటలు పండించిన రైతులకు మద్దతు ధరను ప్రకటించి వారిని ఆదుకునేందుకు ఏమాత్రం శ్రద్ధ చూపించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.  రైతులు ఈ క్రాప్, సర్టిఫికెట్‌ ఆఫ్‌ కల్టివేషన్‌ (సీవోసీ)లతో రిజిస్ట్రేషన్‌ల ద్వారా నమోదు చేసుకున్న పంటను కొనుగోలు చేయలేదన్నారు. నాగార్జునసాగర్‌లో నిండుగా నీరున్నా కనీసం రైతులకు ఒక పంటకైనా నీరివ్వకుండా గుడ్డిగా వ్యవహరించిందన్నారు. 
Back to Top