కార్మికులను రోడ్డునపడేసేలా బాబు పాలన

విశాఖ: కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి మండిపడ్డారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐకేపీ, మెప్మా ఉద్యోగులకు వేతనాలు పెంచుతామని మోసం చేశారన్నారు. రాష్ట్రంలో మూడున్నర లక్షల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు భద్రత లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు ఎప్పుడు ఉద్యోగాలు ఊడబెరుతారోనని భయాందోళనలో ఉన్నారన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వస్తేనే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. 
Back to Top