స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో టీడీపీ విఫ‌లం

డుంబ్రిగూడ‌: గ్రామాల్లో తాగునీటి సౌకర్యం కల్పించడంలో టీడీపీ ప్రభుత్వం విఫలం చెందుతుందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో తాగునీరుతో పాటుగా రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన టీడీపీ ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచి కూడ పరిష్కరించడంలో శ్రద్ద చూపడం లేదని గిరిజనులు మండిపడ్డారు. డుంబ్రిగుడ మండలం అరమ పంచాయతీ కేంద్రంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు అరుణ‌కుమారి, శెట్టి అప్పాలు గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. పార్టీ నాయకులకు పూలదండలతో గిరిజనులు స్వాగ‌తం ప‌లికారు. గ్రామంలోని ప్ర‌తీ ఇంటికి వెళ్లి ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు పార్టీ నాయ‌కులు స్వ‌యంగా అడిగి తెలుసుకున్నారు. ఎన్నిక‌ల ముందు అది చేస్తాం.. ఇది చేస్తామ‌ని చెప్పి ఓట్లు దండుకున్న త‌రువాత గిరిజ‌న ప్ర‌జ‌ల‌ను గాలికొదిలేశార‌ని మండిప‌డ్డారు. వైయ‌స్ఆర్ సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడే సమస్యలు పరిష్కరం అవుతాయ‌న్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం  చెందింద‌ని అరుణ‌కుమారి, అప్పాలు విమ‌ర్శించారు. కార్య‌క్ర‌మంలో పార్టీ మండల అద్యక్షుడు శెట్టి సొర్రు, ఎంపీటీసీ వంతల సద్దు, మాజీ ఎంపీటీసీ బి సుందర్‌రావు, హరి, రాజులమ్మ, గోప్పన్న తదిత‌రులు పాల్గొన్నారు.

Back to Top