పోలవరాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర: మైసూరారెడ్డి

వైఎస్‌ఆర్‌కడప జిల్లా: పట్టి సీమ ఎత్తిపోతల పథకం కోసం రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంతో కుమ్మక్కై పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తున్నాయని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత  ఎంవీ మైసూరారెడ్డి  ఆరోపించారు. కమలాపురం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు మైసూరా రెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడారు. కేంద్రం బడ్జెట్‌లో పోలవరానికి కేవలం రూ. 100 కోట్లు మాత్రమే కేటాయించటంలో అనుమానాలు కలుగుతున్నాయని ఆయన అన్నారు. ఈ రకమైన కేటాయింపులతో పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.  రెక్కలు విరిచారంటున్న చంద్రబాబు..కేంద్రంలో తమ నాయకుల్ని ఎందుకు మంత్రులుగా కొనసాగిస్తున్నారని సూటిగా ప్రశ్నించారు.


గాలేరు - నగరి సుజల స్రవంతి ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలన్న డిమాండ్ తో   రాయలసీమకు నీరు తరలించుకొని పోతున్నారని గతంలో దేవినేని ఉమ ఆందోళన చేశారని గుర్తు చేశారు. అటువంటప్పుడు గండికోటకు జూలైలోగా నీరు అందిస్తామంటే ఎలా నమ్మాలని ఆయన ్రపశ్నించారు.

తాజా వీడియోలు

Back to Top