సమస్యల పరిస్కారంలో టీడీపీ విఫలం

వైయఎస్‌ఆర్‌సీపీ ఉద్యమిస్తే తప్పుబట్టడం సిగ్గు చేటు
విలేకర్ల సమావేశంలో వైయస్సార్‌సీపీ నేతలు

చెన్నూరు : మండలంలో సమస్యలు తాండవిస్తున్నాయని ఈ మూడేళ్ల టీడీపీ పాలనలో ఏ ఒక్కటీ పరిస్కారం చేయని వారు, ప్రజా సమస్యల కోసం తాము ఆందోళన చేస్తే తప్పుపట్టడం సిగ్గుచేటని వైయస్సార్‌సీపీ మండల కన్వినర్‌ జీఎన్‌ బాస్కర్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యులు చీర్ల సురేష్‌యాదవ్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు గురువారం పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ చెన్నూరు గ్రామంలో హైవేరోడ్డు విస్తరణ పనుల్లో ఇల్లు స్తలాలు కోల్పోయిన భాధితులకు ఇల్లు స్తలాలు ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. హైవే పక్కన సర్వీస్‌ రోడ్లు, మురుగు కాల్వలు, వంతెన నిర్మాణాలు చేయకున్నా మిన్నకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 27న ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ఆద్వర్యంలో టోల్‌ప్లాజా వద్ద వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అంజద్‌బాష, మేయర్‌ సురేష్‌బాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, నాయకులతో కలిసి భారీ ఆందోళన చేస్తే కేఎంసీ సంస్త, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు పనులు చేయడానికి ముందుకు వచ్చారన్నారు. ప్రజా సమస్యలపై పోరాడి వాటిని పరిస్కారం చేసేందుకు కృషి చేసే పార్టీ వైఎస్సార్‌సీపీనే అని ప్రజలందరూ గుర్తించారన్నారు. చెన్నూరులోని సమస్యలు పరిస్కారం అవనున్నాయని దీంతో ప్రజల్లో టీడీపీ వ్యతిరేకత వస్తుందనే భయంతో వైఎస్సార్‌సీపీ నాయకులపై ఆరోపనలు చేస్తున్నారని ఇది తగదని ప్రజలు తగిన బుద్ది చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కార్యక్రమంలో చెన్నూరు ఉప సర్పంచు ఖరీం, వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం నాయకులు అబ్దుల్‌రబ్, వారీష్, బాషుమియా, మునీర్, అన్వర్, నవాజ్, అహ్మద్‌హుస్సేన్, నాయకులు యర్రసాని మోహన్‌రెడ్డి, వీరారెడ్డి, తుంగా చంద్రయాదవ్, గుమ్మళ్ల మధుసూదన్‌రెడ్డిలు పాల్గొన్నారు.
Back to Top