టీడీపీది అవినీతి, రాక్షస పాలన

ప్రకాశంః  టీడీపీది అవినీతి, రాక్షస పాలన అని వైయస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఐవీ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. భూములు ఇవ్వకుంటే పంటలను తగులబెడుతున్నారని మండిపడ్డారు. తన పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారితే పశువులు అన్న చంద్రబాబు... అదే పశువులను ఏపీలో కొనుగోలు చేశాడని విమర్శించారు. ప్రజల ఆస్తులతో కాలక్షేపం చేస్తూ, దేశ విదేశాల్లో తిరుగుతూ ప్రజాధనాన్ని నిలువునా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి వసతుల్లేని రాజధానికి అందరినీ రమ్మని తన కుటుంబాన్ని హైదరాబాదులోనే పెట్టుకున్నాడని దుయ్యబట్టారు.  పదేళ్ల కిందట కరువును మరచిన తెలుగు ప్రజలు మళ్లీ చంద్రబాబు కరువును వెంటబెట్టుకురావడంతో అవస్థలు పడుతున్నారని అన్నారు. వర్షాభావ పరిస్థితులతో ప్రజలు గుక్కెడు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తన తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు రాష్ట్రాన్ని నాశనం చేశాడని, ప్రస్తుత మూడేళ్లలోనే అంతకు మించిన వినాశనం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Back to Top