చైర్మన్‌ ఎన్నికను అడ్డుకునేందుకు టీడీపీ డ్రామా

కృష్ణా: జగ్గయ్యపేట మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి అధిక మెజార్టీ ఉండడంతో మున్సిపల్‌ కార్యాలయం వద్ద విధ్వంసం సృష్టించారు. టీడీపీ కౌన్సిలర్లను వైయస్‌ఆర్‌ సీపీ నేతలు కిడ్నాప్‌ చేశారంటూ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యల నేతృత్వంలో హైడ్రామాకు తెరలేపి చైర్మన్‌ ఎన్నిక హాల్‌లో బారికేడ్లను తొలగించి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా పోలీసులపైనే దౌర్జన్యానికి దిగారు. మెజార్టీ లేకపోవడంతో ఓడిపోతామనే భయంతో ఎన్నిక నిలిపివేయాలని ఆందోళనకు దిగారు. దీంతో మున్సిపల్‌ కార్యాలయం వద్ద పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. టీడీపీ నేతల తీరుపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిర్లు మండిపడ్డారు. ప్రలోభాలతో మా కౌన్సిర్లను కొనాలని చూశారని, ఫలించకపోవడంతో ఎన్నిక వాయిదా అంటూ కుట్ర పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా మొత్తం 27 కౌన్సిలర్‌ స్థానాలకు వైయస్‌ఆర్‌ సీపీ 16 కైవసం చేసుకోగా, టీడీపీ 10 స్థానాలకే పరిమితమైంది. 

తాజా ఫోటోలు

Back to Top