వెన్న‌పూస విజ‌యం బాబుకు చెంపపెట్టు

ఆత్మకూరుః డ‌బ్బుతో ఏదైనా ఎంత‌టి విజ‌యాన్నైనా కొనుగోలు చేయోచ్చు అని భావించే చంద్ర‌బాబు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాలు చెంప‌పెట్టు లాంటిద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండ‌ల క‌న్వీన‌ర్ వ‌డ్డుప‌ల్లి న‌ర‌సింహారెడ్డి విమ‌ర్శించారు. ఇది విజయానికి ఆరంభమని ఇక టీడీపీ పతనం కొనసాగుతుందని తెలియచేశారు . ఎమ్మెల్సీ అభ్యర్థి గొపాల్‌రెడ్డి గెలుపొందిన సందర్భంగా బుధవారం స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ ఎన్నికల్లో యువతకు ఇంటికొ ఉద్యోగం ఇస్తామని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని కల్పిస్తామని చెప్పి చంద్ర‌బాబు ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టారని మండిప‌డ్డారు. ముఖ్యమంత్రి చేసిన మోసాన్ని గుర్తుపెట్టుకొని తగిన గుణ పాఠం చెప్పి వెన్నపూస గోపాల్‌రెడ్డిని గెలిపించిన పట్టుభధ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి చంద్రశేఖర్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు కేశవరెడ్డి , జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యులు మధు, జిల్లా రైతు సంఘం కార్యదర్శి మల్లన్న, జిల్లా కార్యదర్శి వెంకట్రాముడు, మహిళా మండల కన్వీనర్‌ పంపనూరు సుబద్రమ్మ ,సర్పంచ్‌ పార్వతమ్మ , మండల ఉపాధ్యక్షుడు పెదయ్య , మండల రైతు సంఘం నాయకుడు ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

Back to Top