ప్రజాసమస్యలు గాలికొదిలి ప్రతిపక్షంపై దాడి

ఒంగోలు: శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రమశిక్షణ తప్పారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి ప్రతిపక్షంపై వ్యక్తిగత దాడికి దిగుతున్నారని ఆయన శుక్రవారమిక్కడ అన్నారు. రాష్ట్రంలో గుక్కెడు మంచినీళ్లు లేక ఓ వైపు జనం అల్లాడిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  సభలో ప్రతిపక్షం ప్రజా సమస్యలపై నిలదీస్తే చంద్రబాబు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వితండవాదాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని బత్తుల పేర్కొన్నారు.

Back to Top